సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 నవంబరు 2019 (18:24 IST)

పైల్స్ సమస్యకు ఉల్లికాడలతో చెక్.. నాన్ వెజ్ వంటకాల్లో వాడితే? (video)

పైల్స్ సమస్యతో బాధపడేవారు పెరుగులో ఉల్లికాడలను వేసి పచ్చిగా తినడం మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేస్తే పైల్స్‌ వల్ల వచ్చే వాపు, నొప్పి తగ్గుతాయి.

అలాగే ఉల్లికాడలను రోజువారీ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా క్యాన్సర్ కారకాలు తొలగిపోతాయి. పచ్చి ఉల్లి కాడల రసం తీసుకుని అంతే పరిమాణంలో తేనెతో కలిపి తాగితే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. 
 
జలుబు, దగ్గుతో బాధపడేవారు సూప్స్‌లో ఈ ఉల్లికాడలను కలిపి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఉల్లిపాయలతో పోలిస్తే కాడల్లో సల్ఫర్‌ ఎక్కువగా ఉంటుంది. దాంతో చెడు కొలెస్ట్రాల్‌ తగ్గి, రక్తపీడనం అదుపులో ఉంటుంది. 
 
ఉల్లికాడలను నాన్ వెజ్ వంటకాల్లో వాడితే నీచు వాసన వుండదు. ఉల్లికాడలను ఫ్రైడ్‌రైస్, సలాడ్స్‌లో ఉపయోగిస్తుంటాం. కానీ వంటల్లో రోజూ ఉల్లికాడలను తీసుకుంటే ఆరోగ్యానికి వ్యాధినిరోధక శక్తి పెరుగుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.