శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 నవంబరు 2019 (14:48 IST)

పసుపుకొమ్ము పొడిని నెయ్యితో కలిపి తీసుకుంటే?

చిన్న పసుపుకొమ్ము పొడిని నెయ్యితో కలిపి తీసుకుంటే దగ్గు తగ్గుతుంది. వర్షాకాలం వచ్చే దగ్గు మాయం కావాలంటే.. పసుపు కొమ్ము పౌడర్‌గా చేసుకుని.. అరస్పూన్ పసుపు పొడి.. అరస్పూన్ నెయ్యితో కలిపి తీసుకుంటే.. దగ్గు తగ్గిపోతుంది. అలాగే పసుపును వర్షాకాలంలోనూ, శీతాకాలంలో వంటల్లో చేర్చుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. 
 
పసుపుకొమ్ము బెల్లంతో కలిపి నీటిలో నాననిచ్చి ఆ నీటిని తాగడం ద్వారా రొంపతో వచ్చే గొంతునొప్పి తగ్గుతుంది. ఇంగువ రెండు టీ స్పూన్లు తీసుకుని, పసుపువేసి రెండిటినీ పేపర్‌లో చుట్టి దాన్ని కాల్చి, వాసన పీల్చినట్లైతే మైగ్రేన్ తల నొప్పి తగ్గుతుంది.
 
గ్లాసుడు పాలు వేడిచేసి దానిలో తేనె వేసి తాగితే రాత్రిపూట వచ్చే దగ్గు తగ్గుతుంది. పాలల్లో తేనె, చిటికెడు పసుపు వేసి బాగా కాచి, ఆ పసుపు పాలు తీసుకున్నా దగ్గు, జలుబు తగ్గుతాయి. వర్షాకాలంలో పిల్లలకు నీళ్ళలో పసుపుని కలిపి తాగిస్తే కడుపులో వుండే నులి పురుగుల్ని హరిస్తుంది.