1. ఆధ్యాత్మికం
  2. ఆధ్యాత్మికం వార్తలు
  3. హిందూ
  4. koilalwar thirumanjanam in tirumala

తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

koilalwar thirumanjanam
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్‌ ఆళ్వారు తిరుమంజనం కార్యక్రమం మంగళవారం శాస్ర్తోక్తంగా జరిగింది. ఆలయంలోని గోడలు, వాకిళ్లు ప్రత్యేక ద్రవంతో శుద్ధి చేశారు. ఉగాదిని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. మహాద్వారం నుంచి ఆనంద నిలయం వరకు ఆలయాన్ని శుభ్రపరిచారు. 
 
పచ్చకర్పూరం, చందనం, కుంకుమ, పసుపు, తిరునామం, కుంకుమపువ్వు వంటి సుగంధ ద్రవ్యాల మిశ్రమాన్ని ఆలయ గోడలకు పూసి శుద్ధి చేశారు. అనంతరం స్వామికి పట్టు వస్ర్తాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. 
About Writer
pyr