1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
  4. Angelina Jolie: Islamic State fighters using rape as 'policy'

లైంగిక హింసతో విధ్వంసం.. ఏడేళ్ల బాలికల్ని కూడా వదలరా?: జోలీ

Angelina Jolie
ప్రముఖ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్‌పై హాలీవుడ్ నటి ఏంజెలీనా జోలీ మండిపడింది. ఐఎస్ఐఎస్ ప్రాబల్యం గల ప్రాంతాల్లో లైంగిక హింసతో టెర్రరిస్టులు విధ్వంసానికి పాల్పడుతున్నట్లు జోలీ పేర్కొంది. కనీసం ఏడేళ్ల బాలికల్ని కూడా వదలట్లేదని జోలీ ఆందోళన వ్యక్తం చేసింది. అత్యాచారాలను కూడా బలమైన ఆయుధంగా వాడుకుంటున్నారని, ఐఎస్ కమాండర్లకు అత్యాచారాలు చేయడం ఒక అలవాటుగా మారిపోయిందని జోలీ ఆవేదన వ్యక్తం చేసింది. 
 
ఇరాక్, సిరియాలు కేంద్రంగా ఐఎస్ఐఎస్ చేసినన్ని ఆగడాలు ఇంతవరకు ఎవరూ చూసి ఉండరని, అత్యాచారాలను ఆయుధాలుగా వాడుకుంటున్న ఐఎస్ ఉగ్రవాదుల వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుని కఠినమైన చర్యలు తీసుకోవాలని బ్రిటిష్ పార్లమెంటరీ కమిటీని జోలీ కోరింది. ఐఎస్ ఉగ్రవాదులు అత్యాచారాల్ని కూడా ఉగ్రవాదానికి కేంద్ర స్థానంగా వాడుకుంటున్నారని తెలిపింది.
About Writer
Selvi