1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
  4. best home remedies with ice cubes

చేదు మాత్రం మింగేముందు ఐస్ ముక్క నోట్లో వేసుకుంటే...

చాలా మందికి మాత్రలు మింగాలన్నా.. ఏదేని మందు తాగాలన్నా తెగ కష్టపడిపోతారు. వైద్యులు చెప్పినట్టుగా మందులు తీసుకునేందుకు సుతరామా ఇష్టపడరు. ఇలాంటి చిన్నపాటి చిట్కాను పాటిస్తే మాత్రను సులభంగా మింగవచ్చు. అవే

ice cubes
చాలా మందికి మాత్రలు మింగాలన్నా.. ఏదేని మందు తాగాలన్నా తెగ కష్టపడిపోతారు. వైద్యులు చెప్పినట్టుగా మందులు తీసుకునేందుకు సుతరామా ఇష్టపడరు. ఇలాంటి చిన్నపాటి చిట్కాను పాటిస్తే మాత్రను సులభంగా మింగవచ్చు. అవేంటో ఓసారి పరిశీలిద్ధాం.
 
* చేదు మాత్రలు లేదా టానిక్ వంటి మందులు తీసుకునే ముందు.. ఓ ఐస్ ముక్కను నోట్లో వేసుకోవడం వల్ల ఔషధం చేదుగా అనిపించదు. 
* వాంతులు అదేపనిగా వస్తుంటే ఐస్ ముక్కను చప్పరిస్తే ఉపశమనం కలుగుతుంది. 
* శరీరంలో ఎక్కడైనా గాయం తగిలి రక్తం తదేకంగా కారుతుంటే దానిపై ఐస్ ముక్క ఉంచినట్టయితే రక్తం కారడం ఆగిపోతుంది. 
* ముల్లు గుచ్చుకుని నొప్పి అధికంగా ఉంటే ఆ ప్రాంతంలో ఐస్ ముక్క ఉంచితే తక్షణం ఉపశమనం కలుగుతుంది. 
* తీసుకున్న ఆహారం జీర్ణంకాకుంటే ఐస్ ముక్కను చప్పరించండి. దీంతో ఆహారం త్వరగా జీర్ణమౌతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఆవు పాలు తాగితే ఈ అనారోగ్య సమస్యలు దరిచేరవంతే...