1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
  4. Joint pains to stop Tamarind leaves

చింతాకులతో కీళ్ల నొప్పులకు చెక్.. ఎలా..?

కీళ్ళనొప్పులున్న వారు తరచూ మందులు మాత్రలు ఉపయోగిస్తుంటారు. కాని కొన్ని ఉపాయాలు పాటిస్తే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

Tamarind leaves
కీళ్ళనొప్పులున్న వారు తరచూ మందులు మాత్రలు ఉపయోగిస్తుంటారు. కాని కొన్ని ఉపాయాలు పాటిస్తే కీళ్ళ నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. 
 
* సహజంగా కీళ్ళ నొప్పులు ప్రతి ఒక్కరినూ ఉంటాయి. ఇవి ఎక్కువగా, ఉదయం, సాయింత్రం వేళల్లో కనిపిస్తుంటాయి. దీనికి ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు నొప్పి ఉన్నచోట నొప్పి నివారణ మందు పూయండి.
 
* కాస్త ఉప్పు కలిపిన నీటిలో చింతాకులు ఉడికించి నొప్పులున్నచోట ఆనీటిని పోయండి నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుందంటున్నారు వైద్యులు. విటమిన్ సి కి సంబంధించిన పండ్లు అధికంగా తీసుకోవాలి.
 
* నొప్పులున్నచోట యూకలిప్టస్ ఆయిల్ పూసి వేడినీళ్ళతో తాపడం పెట్టాలి. లేకుంటే మెత్తటి తువ్వాలు వేడినీళ్ళల్లో ముంచి బాగా పిండిన తర్వాత ఆ వేడి తువ్వాలును నొప్పులున్న చోట పెట్టండి. దీంతో నొప్పులంనుంచి ఉపశమనం కలుగుతుంది.
 
* వారానికి ఒకసారి ఉపవాసం ఉండటం మంచిది. క్యారెట్‌జ్యూస్, క్యాబేజ్‌సూప్ తీసుకుంటే నొప్పులు తగ్గుతాయి. అధిక బరువు ఉన్నవారు బరువు తగ్గేమార్గం ఆలోచించాలి. ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, పాలు, ఉర్లగడ్డలు వాడకూడదు.
About Writer
pnr
తర్వాతి కథనం
పుచ్చకాయ రసంతో తలనొప్పి మాయం.. ఇలా చేయండి?