1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. CPEC may create more India-Pakistan tension: UN report

చిచ్చుపెట్టిన చైనా : భారత్ - పాక్‌ల మధ్య యుద్ధం తప్పదా?

ఆధిపత్యపోరులో భాగంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చైనా చిచ్చుపెట్టింది. దీంతో దాయాది దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనా తలపెట్టిన భారీ బడ్జెత్‌తో నిర్మితమవుతున్న చైనా - పాకిస్థాన్ ఎకనామిక్

CPEC
ఆధిపత్యపోరులో భాగంగా భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య చైనా చిచ్చుపెట్టింది. దీంతో దాయాది దేశాల మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్నాయి. చైనా తలపెట్టిన భారీ బడ్జెత్‌తో నిర్మితమవుతున్న చైనా - పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్ వల్ల భారత ఉపఖండంలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే పరిస్థితులు ఏర్పడనున్నాయి. దీనికంతటికీ చైనా ప్రధాన కారణమని అమెరికా రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 
 
భారత్ - పాకిస్థాన్‌ల మధ్య మళ్లీ యుద్ధ మేఘాలు అలుముకునే అంశంపై విల్స్ సెంటర్ దక్షిణాసియా డిప్యూటీ డైరెక్టర్ మైఖేల్ కూగల్ మెన్ స్పందిస్తూ, చైనా-పాకిస్థాన్ ఎకనామిక్ కారిడార్‌ను నిర్మించడమే చైనా ప్రధాన లక్ష్యమని... అయితే, ఈ వ్యవహారం చివరకు భారత్, పాకిస్థాన్‌ల మధ్య తీవ్రఉద్రిక్తతలకు కారణమవుతుందని అభిప్రాయపడ్డారు. 
 
అందువల్ల చైనా కోరికల మేరకు పాకిస్థాన్ పని చేస్తోందని.. ఇది పాకిస్థాన్ తన రక్షణ, ఆర్థిక వ్యవస్థలను స్వయంగా నాశనం చేసుకోవడమేనని కూగల్ మెన్ చెప్పారు. అయితే, ఈ ప్రాజెక్టును భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని... ప్రాజెక్టు ముందుకు సాగితే, ఆసియాలో ఉద్రిక్తతలు నెలకొంటాయని ఆందోళన వ్యక్తంచేశారు. 
About Writer
pnr
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఇవాంకా... ఆ డ్రెస్ ఏంటీ... ఛాతీ వద్ద గౌనుకు ఆ రంధ్రం ఏంటీ?