లింగభేదం కొంపముంచింది.. దిగజారిన భారత్.. కారణం ఏమిటో తెలుసా?
లింగభేదమే భారత్ కొంపముంచింది. భారత ర్యాంకును దిగజార్చింది. అవును. ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ లింగ భేద సూచీలో మనదేశం మరింత దిగజారింది. గతంతో పోల్చితే 21 స్థానాలు ది
లింగభేదమే భారత్ కొంపముంచింది. భారత ర్యాంకును దిగజార్చింది. అవును. ప్రపంచ ఆర్థిక ఫోరం (డబ్ల్యూఈఎఫ్) తాజాగా విడుదల చేసిన అంతర్జాతీయ లింగ భేద సూచీలో మనదేశం మరింత దిగజారింది. గతంతో పోల్చితే 21 స్థానాలు దిగజారింది. 2016లో 68.3% వున్న జెండర్ గ్యాప్ ఈ ఏడాది 68గా వుంది. ఈ తేడా పూర్తిగా సమసిపోవాలంటే.. కనీసం వందేళ్లైనా అవుతుందని డబ్ల్యూఈఎఫ్ తెలిపింది.
ఆర్థిక వ్యవస్థలో మహిళల భాగస్వామ్యం తగ్గడంతో పాటు తక్కువ వేతనాల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఇతర దేశాలతో పోల్చితే భారత్‌లో జెండర్ గ్యాప్ 67 శాతం మేర తగ్గించింది. అయితే పొరుగు దేశమైన బంగ్లాదేశ్ 47వ ర్యాంకు, చైనా 100వ ర్యాంకు సాధించడం విశేషం. విద్య, ఆరోగ్యం, పనిచేసే చోటు, రాజకీయ ప్రాతినిథ్యం ఈ నాలుగు అంశాల ఆధారంగా డబ్ల్యూఈఎఫ్ లింగ బేధాన్ని లెక్కిస్తుంది.
ఈ క్రమంలో.. ప్రాథమిక, ప్రాథమికోన్నత విద్య విషయంలో భారత్ లింగ భేదం పూర్తిగా సమసిపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం. కానీ రాజకీయ సాధికారత, ఆరోగ్యకరమైన జీవనం. కనీస అక్షరాస్యత అంశాల్లో స్త్రీ, పురుష భేదాలు ఎక్కువగా ఉండటం వల్లే భారత ర్యాంకు దిగజారింది.