శనివారం, 23 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 25 నవంబరు 2017 (15:42 IST)

33 వేల మందిని మింగేసిన సముద్రం.. ఎక్కడ?

భూమండలంపై ఉన్న సముద్రాల్లో మధ్యదరాసముద్రం ఒకటి. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఈ సముద్రం ఏకంగా 33 వేల మందిని మింగేసింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. వివిధ దేశాల నుంచి అక్రమ మార్గంలో యూరోపియన

భూమండలంపై ఉన్న సముద్రాల్లో మధ్యదరాసముద్రం ఒకటి. ఇది అత్యంత ప్రమాదకరమైనది. ఈ సముద్రం ఏకంగా 33 వేల మందిని మింగేసింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. వివిధ దేశాల నుంచి అక్రమ మార్గంలో యూరోపియన్‌ యూనియన్‌‌లోని వివిధ దేశాలను చేరుకునేందుకు మధ్యదరాసముద్ర మార్గాన్ని ఎంచుకుంటారు. 
 
ఇలా ఈ సముద్రజలాల్లో ప్రయాణిస్తూ ఏకంగా, 33,000 మంది జలసమాధి అయ్యారని ఐక్యరాజ్యసమితి ఓ నివేదికలో వెల్లడించింది. దీంతో మధ్యదరా సముద్రాన్ని అత్యంత ప్రాణాంతక సరిహద్దుగా గుర్తిస్తున్నట్టు తెలిపింది. 2000 నుంచి 2016 వరకూ మధ్యదరా సముద్రం గుండా ప్రయాణిస్తూ వీరంతా ప్రాణాలు కోల్పోయారని ఐక్యరాజ్యసమితి ప్రకటనలో తెలిపింది.
 
అయితే యూరోపియన్ యూనివర్శిటీ సముద్ర పరిశోధకులు మాత్రం మరోలా స్పందిస్తున్నారు. వాస్తవానికి మధ్యదరా పొట్టనబెట్టుకున్న వారి సంఖ్య 33 వేలకు పైమాటగానే ఉంటుందని చెపుతున్నారు. మృతుల్లో చాలా మంది లెక్కల్లోకి తీసుకోలేదని వెల్లడించారు.