సంబంధిత వార్తలు
- మయన్మార్ జేడ్ గనిలో మట్టిచరియలు విరిగిపడి 50మంది మృతి
- మైనర్ చెల్లిపై భర్త అత్యాచారం... భర్తనే గొడ్డలితో నరికేసిన నిండు గర్భిణి
- అది నేర్చుకోవడానికి కొడుకును విదేశాలకు పంపుతున్న బాలయ్య
- ఇరాన్‌పై అగ్రరాజ్యం కన్నెర్ర : ఎయిర్‌స్ట్రైక్‌లో రెండో అగ్రనేతను చంపేసింది...
- ప్రేముంటే సూసైడ్ చేసుకుందాం రా... నిరాకరించిన యువతి గొంతు కోసిన ప్రియుడు
గని కార్మికులపై బురద పంజా : 103 మంది మృత్యువాత
మయన్మార్‌లో విషాదం జరిగింది. గనిలో పని చేసే కార్మికులపై బురద పంజా విసిరింది. ఈ ప్రమాదంలో 103 మంది మృత్యువాతపడినట్టు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం మయన్మార్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కాచిన్ రాష్ట్రంలోని వర్షాలకు భారీ ప్రమాదం జరగడంతో రంగురాళ్ల గనుల్లో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో 103 మంది మృత్యువాత పడ్డారు.
కొండలా పేరుకుపోయిన మైనింగ్ వ్యర్థాలు భారీవర్షం కారణంగా దిగువన ఉన్న సరస్సులో పడ్డాయి. దాంతో సరస్సులోని నీరు ఉప్పొంగి సమీపంలో ఉన్న గనులను ముంచెత్తింది. దాంతో కార్మికులు ఆ బురదనీటిలో ఉక్కిరిబిక్కిరై మృతి చెందారు.
ప్రస్తుతం అక్కడ సహాయచర్యలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఐదేళ్ల కిందట కూడా కాచిన్ రాష్ట్రంలో ఇలాంటి ప్రమాదమే జరగ్గా వంద మందికిపైగా మరణించారు.
తర్వాతి కథనం
