బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జులై 2020 (12:57 IST)

మయన్మార్‌ జేడ్ గనిలో మట్టిచరియలు విరిగిపడి 50మంది మృతి

Myanmar
మయన్మార్‌లో ఘోర ప్రమాదం సంభవించింది. నార్తర్న్ మయన్మార్‌లో ఉన్న జేడ్ గనిలో మట్టిచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 50మందికి పైగా మృతి చెందారు. నార్తర్న్ మయన్మార్‌లో ఉన్న జేడ్ గనిలో ఈ ప్రమాదం జరిగింది. మట్టిచరియల కింద కార్మికులు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ఆ దేశ అగ్నిమాపక శాఖ సహాయక చర్యల్లో నిమగ్నమైంది.
 
కాచిన్ రాష్ట్రంలో ఉన్న గనిలో రాళ్లు సేకరిస్తున్న సమయంలో భారీ వర్షం వల్ల కొండచరియలు విరిగిపడ్డాయి. దాదాపు 50 మృతదేహాలను వెలికితీసారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 2015లో ఇక్కడే జరిగిన ఘటనలో 116 మంది మరణించారు. 
 
కాచిన్ రాష్ట్రంలోని జాడే-రిచ్ హపకాంత్ ప్రాంతంలో మైనర్లు రాళ్ళు సేకరిస్తున్నప్పుడు ఈ ప్రమాదం సంభవించిందని.. భారీ వర్షం కారణంగా కొండచరియలు విరిగి పడినట్టు అధికారులు గుర్తించారు. ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.