గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By జె
Last Modified: గురువారం, 20 ఫిబ్రవరి 2020 (20:32 IST)

అది నేర్చుకోవడానికి కొడుకును విదేశాలకు పంపుతున్న బాలయ్య

నందమూరి కుటుంబం గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. మొదటగా నందమూరి తారకరామారావు సినీపరిశ్రమలో సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. ఇది అందరికీ తెలిసిందే. ఆ తరువాత బాలయ్య బాబు. తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బాలయ్యబాబు అగ్రహీరోగా రాణిస్తున్నాడు.
 
ఆ తరువాత నందమూరి కుటుంబంలో జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్నలు ఉన్నారు. అయితే వీరి ముగ్గురిలో ఎన్టీఆర్ మాత్రమే అగ్ర యువ హీరోగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్నాడు. అయితే వీరందరి కన్నా నందమూరి అభిమానుల్లో మోక్షజ్ఞ మీద ఎప్పటి నుంచో ఆశ ఉంది.
 
మోక్షజ్ఞ బాలక్రిష్ణ కుమారుడు. అతను మరో వారంరోజుల్లో సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నాడనీ, సినిమాలో రాణిస్తున్నాడంటూ ఆ మధ్య పెద్ద ప్రచారమే జరిగింది. కానీ బాలయ్య బాబు మాత్రం ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కానీ తాజాగా బాలయ్య తన కుమారుడిని సినీ రంగంలోకి తీసుకురావాలని నిర్ణయించేసుకున్నారట. 
 
అందుకే మోక్షజ్ఞను న్యూయార్క్ లోని లీస్టార్ ఫిలిం ఇనిస్టిట్యూట్‌కు మరో వారంరోజుల్లో పంపించబోతున్నారట. అక్కడ నటనకు సంబంధించి మెళుకువలను నేర్చుకోబోతున్నారట మోక్షజ్ఞ. ఇది పూర్తవగానే తెలుగు సినీపరిశ్రమలకు మోక్షజ్ఞను పరిచయం చేయాలని బాలయ్య నిర్ణయించేసుకున్నారట.