శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 21 డిశెంబరు 2019 (18:02 IST)

మోక్ష‌జ్ఞ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన బాల‌య్య‌

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌ట వార‌సుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది..?  ఎవ‌రి ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంది..? అని గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా బాల‌య్య అభిమానులు ఎదురు చూస్తునే ఉన్నారు కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కు క్లారిటీ లేదు. 
 
అయితే.. అప్పుడ‌ప్పుడు మోక్ష‌జ్ఞ ఫోటోలు బ‌య‌ట‌కు రావ‌డం.. ఆ ఫోటోల్లో మోక్ష‌జ్ఞ హీరో లుక్‌లో కాకుండా సాధార‌ణ యువ‌కుడుగా మామూలుగా ఉండ‌డంతో అస‌లు మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఉంటుందా..?  ఉండ‌దా..? అనే సందేహ‌లు ఏర్ప‌డడం మొద‌ల‌య్యాయి. 
 
దీనిపై బాల‌య్య ఎప్పుడు క్లారిటీ ఇస్తారా..? అని ఎంతో ఆస‌క్తితో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్‌కి బాల‌య్య రూల‌ర్ ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంట‌ర్ వ్యూలో క్లారిటీ ఇచ్చారు. 
 
ఇంత‌కీ ఏమ‌న్నారంటే.. మోక్ష‌జ్ఞ సినిమా రంగ ప్ర‌వేశం గురించి చాలామంది అడుగుతున్నారు. త‌ప్ప‌కుండా మోక్ష‌జ్ఞ సినిమాల్లోకి వ‌స్తాడు. క‌థ‌ల గురించి నాతో చ‌ర్చిస్తున్నాడు. ఇప్పుడిప్పుడే సినిమాపై మ‌రింత ఆస‌క్తి ఏర్ప‌డుతుంది. కాక‌పోతే మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఎప్పుడు అనేది ఇప్పుడు చెప్ప‌లేను.

స‌మ‌యం వ‌చ్చినప్పుడు పూర్తి వివ‌రాల‌తో తెలియ‌చేస్తాను అన్నారు బాల‌య్య‌. సో.. మోక్ష‌జ్ఞ సినిమాల్లోకి రావ‌డం ఖాయం. అయితే.. ఆ స‌మ‌యం ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.