ప్రభాస్ జాన్ ఇప్పట్లో రిలీజ్ కాదా..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. సాహో ఆశించిన స్ధాయిలో ఆకట్టుకోకపోవడంతో ఈసారి ఖచ్చితంగా విజయం సాధించాలనే పట్టుదలతో ఇంకా చెప్పాలంటే కసితో జాన్ మూవీ చేస్తున్నాడు. ఈ చిత్రం జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతోంది. యు.వి. క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. తాజా షెడ్యూల్ స్టార్ట్ కావాలి కానీ.. కథ పై కసరత్తులు చేస్తుండడం వలన ఇంకా లేటెస్ట్ షెడ్యూల్ ప్రారంభం కాలేదు.
ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమాను వైవిధ్యమైన ప్రేమకథా చిత్రంగా రూపొందిస్తుండడంతో అభిమానులు ఎప్పుడెప్పుడు ఈ సినిమాని చూద్దామా అని ఎదురు చూస్తున్నారు. సమ్మర్ లో రిలీజ్ చేస్తారని గతంలో వార్తలు వచ్చాయి కానీ.. ఇంకా తాజా షెడ్యూల్ ప్రారంభం కాకపోవడంతో ఇప్పట్లో ఈ సినిమా రిలీజ్ ఉండదని గట్టిగా ప్రచారం జరగుతోంది.
ఇటలీ బ్యాక్ డ్రాప్‌తో రూపొందుతోన్న ఈ భారీ చిత్రం కోసం అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో భారీ సెట్ వేస్తున్నారు. దసరాకైనా ఈ సినిమాని రిలీజ్ చేయాలని ఈ చిత్ర దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం ప్రభాస్ విదేశాల్లో ఉన్నారు. వచ్చిన తర్వాత త్వరలో లేటెస్ట్ షెడ్యూల్ హైదరాబాద్ లో ప్రారంభించనున్నారు. మరి.. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే దసరాకి జాన్ రావచ్చు. అలా జరగకపోతే.. ఇంకా లేట్ కావచ్చు.