సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 20 డిశెంబరు 2019 (15:25 IST)

ఫోర్బ్స్ ఇండియా జాబితాలో కోహ్లీదే అగ్రస్థానం.. మహేష్, ప్రభాస్‌లకు చోటు

ఫోర్బ్స్ ఇండియా జాబితాలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ అగ్రస్థానాన్ని సంపాదించాడు. ఈ ఏడాది అత్యధిక సంపాదన, గడించిన పేరు ప్రఖ్యాతలు సంపాదించి ద్వారా ఈ ఏడాది అత్యధిక సంపాదన, గడించిన పేరు ప్రఖ్యాతులు ఆధారంగా వందమంది ప్రముఖుల జాబితాను ఫోర్బ్స్ ఇండియా విడుదల చేసింది. కోహ్లీ తర్వాతి స్థానంలో బాలీవుడ్ నటులు అక్షయ్ కుమార్, సల్మాన్‌ఖాన్‌లు ఉన్నారు. 
 
టాలీవుడ్ నటులు ప్రభాస్, మహేశ్‌బాబులు వరుసగా 44, 54వ స్థానాల్లో నిలిచారు. గతేడాది అక్టోబరు 1 నుంచి ఈ ఏడాది సెప్టెంబరు 30 వరకు వారు ఆర్జించిన సంపాదన ఆధారంగా ఈ జాబితాను రూపొందించారు. 
 
ఈ జాబితాలో కోహ్లీ రూ.252.72 కోట్ల ఆదాయంతో అగ్రస్థానంలో ఉండగా, రూ.293.25 కోట్లతో అక్షయ్ కుమార్, రూ.229.25 కోట్లతో సల్మాన్ ఖాన్ రెండు మూడు స్థానాల్లో నిలిచారు. ఇక, దక్షిణాదికి చెందిన ప్రముఖుల్లో.. సూపర్ స్టార్ రజనీకాంత్ వంద కోట్ల రూపాయల ఆదాయంతో 13వ స్థానంలో నిలవగా, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ 94.8 కోట్ల ఆదాయంతో 16వ స్థానంలో నిలిచాడు. రూ.35 కోట్లతో ప్రభాస్ 44వ స్థానంలో, 35 కోట్లతో మహేశ్ బాబు 54వ స్థానంలో ఉన్నారు.