మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2019 (13:01 IST)

కోహ్లీ సూపర్ క్యాచ్.. ఫీల్డింగ్‌లో చెలరేగిపోయాడు.. (video)

వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చెలరేగిపోయాడు. ఫీల్డింగ్‌లో అదరగొట్టాడు. తిరువనంతపురం వేదికగా వెస్టిండిస్‌తో జరిగిన రెండో టీ20లో కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సహచర క్రికెటర్లు మైదానంలో తప్పుల మీద తప్పులు చేస్తుంటే, కోహ్లీ మాత్రం ఫీల్డింగ్‌లో చెలరేగాడు. ఏకపక్షంగా సాగుతున్న మ్యాచ్‌‌లో కోహ్లీ ఓ క్యాచ్ పట్టడంతో మళ్లీ టీమిండియా రేసులోకి వచ్చింది.
 
అద్భుత బ్యాటింగ్‌తో అలరించిన విండిస్ బ్యాట్స్‌మన్ హెట్‌మయర్‌.. జడేజా వేసిన ఓవర్‌లో లాంగాఫ్‌ వైపు భారీ షాట్‌ ఆడాడు. మ్యాచ్‌ని వీక్షిస్తున్న అందరూ ఫోర్ లేదా సిక్సర్ అనుకున్నారు. అయితే, ఆ సమయంలో అక్కడే ఫీల్డింగ్ చేస్తోన్న విరాట్ కోహ్లీ దూరం నుంచి మెరుపు వేగంతో దూసుకొచ్చిన విరాట్‌ డైవ్‌ చేస్తూ అమాంతం క్యాచ్‌ పట్టేశాడు. బంతిని అందుకున్నాక బౌండరీ లైన్‌కు తాకకుండా భారత కెప్టెన్‌ నియంత్రించుకున్న అందరినీ ఆకట్టుకుంది. 
 
ఇందుకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, అంతకముందు ఒకే ఓవర్‌లో రెండు క్యాచ్‌లను భారత ఫీల్డర్లు వదిలేశారు. భువీ వేసిన ఐదో ఓవర్‌లో సిమన్స్ ఇచ్చిన క్యాచ్‌ను మిడాఫ్‌లో వాషింగ్టన్ సుందర్ వదిలేశాడు.