నిత్యానంద ముంచేశాడు.. బండారం బయటపెడ్తా.. విదేశీ భక్తురాలు

Nityananda
సెల్వి| Last Updated: శనివారం, 7 డిశెంబరు 2019 (11:04 IST)
నిత్యానందపై దొంగ బాబా అనే ముద్ర పడిపోయింది. ఓ వైపు కర్ణాటక కోర్టులో నిద్యానందపై క్రిమినల్ కేసులు కొనసాగుతుంటే... ఆ మహానుభావుడు మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమాయకుల్ని తన భక్తులుగా చేర్చుకుంటూ వ్యాపారం పెంచుకుంటున్నాడు. భారత్‌తో పాటు విదేశాల్లో కూడా నిత్యానందను నమ్మి మోసపోయే వారి సంఖ్య పెరిగిపోతూ వస్తోంది.

తాజాగా ఫ్రాన్స్‌కి చెందిన మాజీ భక్తురాలు నిత్యానందపై కేసు పెట్టింది. తన దగ్గర నుంచీ నిత్యానంద రూ.2,85,18,800 కాజేశాడని కేసులో తెలిపింది. దీనిపై ఫ్రాన్స్ ప్రభుత్వం దర్యాప్తుకి ఆదేశించింది. నిత్యానందకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తానని చెప్తోంది.

నిత్యానంద మోసాలన్నీ వెలుగులోకి తెస్తానని అంటోంది. ఒకప్పుడు నిత్యానంద గ్రూపులో ఉండి టాప్ రిక్రూటర్‌గా పనిచేసిన సారా లిండే ఇప్పుడు తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా నిత్యానందపై నిప్పులు చెరుగుతోంది. అక్రమాలన్నీ బయటకు తెస్తోంది.దీనిపై మరింత చదవండి :