శనివారం, 11 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 డిశెంబరు 2019 (16:30 IST)

వెస్టిండీస్‌ రెండో వన్డే: గెలుపే లక్ష్యంగా అదరగొడుతున్న భారత్

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత్ అదరగొడుతోంది. భారత ఓపెనర్తైన కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. కేఎల్‌ రాహుల్‌ 46 బంతుల్లో అర్థసెంచరీ బాదాడు. మూడు ఫోర్లు, మూడు సిక్సులు కొట్టాడు కేఎల్‌ రాహుల్‌. అటు రోహిత్‌ శర్మ కూడా ఇదే జోరును ప్రదర్శిస్తున్నాడు. ప్రస్తుతం జట్టు స్కోరు 21 ఓవర్లకు 117గా ఉంది. 
 
కాగా టాస్‌ గెలిచిన విండీస్‌ బౌలింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు కొంత మార్పులు చేసుకున్నాయి. విండీస్‌ అంబ్రోస్‌ స్థానంలో ఎవిన్‌ లెవిస్‌, వాల్ష్‌ స్థానంలో కేరీ పెరారేకు అవకాశం కల్పించింది. శివమ్‌ దూబే స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌కు టీమిండియా ఛాన్స్‌ ఇచ్చింది.
 
ఇకపోతే.. విండీ టీ20 సిరీస్‌ గెలుచుకున్న పటిష్ట టీమిండియాకు చెన్నై వన్డేలో అనూహ్య పరాజయం ఎదురైంది. గత మ్యాచ్‌లో బౌలింగ్, టాపార్డర్‌ వైఫల్యంతో ఓటమిని ఎదుర్కొన్న కోహ్లీసేన విజయమే లక్ష్యంగా రెండో వన్డేకు సిద్ధమైంది. 
 
ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే సిరీస్‌లో నిలిచే స్థితిలో టీమిండియా ఉంది. దీంతో సిరీస్‌ సమంకోసం భారత్‌ ఆరాటపడుతుంటే.. మరోవైపు ఇదే ఊపులో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకోవాలని విండీస్ చూస్తోంది.