శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : శనివారం, 30 నవంబరు 2019 (12:00 IST)

నంద‌మూరి ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన మోక్ష‌జ్ఞ

నంద‌మూరి న‌ట సింహం బాల‌కృష్ణ న‌ట వార‌సుడు మోక్ష‌జ్ఞ ఎంట్రీ అంటూ గ‌త కొంత కాలంగా వార్త‌లు వ‌స్తునే ఉన్నాయి కానీ.. బాల‌య్య నుంచి మాత్రం క్లారిటీ రాలేదు. అయితే.. క‌థ ఫైన‌ల్ అయ్యింది. ద‌ర్శ‌కుడు కూడా ఎవ‌రు అనేది ఖ‌రారు అయ్యింది. ఇలా ర‌క‌ర‌కాల వార్త‌లు మోక్ష‌జ్ఞ గురించి వ‌చ్చాయి. దీంతో బాల‌య్య న‌ట వార‌సుడు ఎంట్రీ కోసం నంద‌మూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్నారు. ఇలా ఎదురు చూసే నంద‌మూరి అభిమానుల‌కు మోక్ష‌జ్ఞ గ‌ట్టి షాక్ ఇచ్చాడు. 
 
ఇంత‌కీ మేట‌ర్ ఏంటంటే... "రూల‌ర్" సినిమా షూటింగ్ స‌మ‌యంలో బాల‌య్య ఫ్యామిలీ మెంబ‌ర్స్‌తో క‌లిసి ఓ ఫోటో తీసుకున్నారు. ఆ ఫోటోలో మోక్ష‌జ్ఞ బాడీ షేప్ అదుపు త‌ప్పింది. ఇంత చిన్న వ‌య‌సులో ఆ పొట్ట ఏంటి..? అనేలా ఉంది అత‌ని స్టిల్. ఈ స్టిల్ చూసి అభిమానుల‌కు క‌రెంట్ షాక్ కొట్టినంత ప‌నైంద‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు. 
 
ఈ ఒక్క ఫోటోతో మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఇప్ప‌ట్లో లేదు అనే విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పిన‌ట్టు అయ్యింది. ఇప్ప‌ట్లో ఏంటి..? అస‌లు సినిమాల్లో ఎంట్రీ ఉంటుందా..? ఉండ‌దా..? అనే అనుమానాలు కూడా మొద‌ల‌య్యాయి. పాపం.. నంద‌మూరి అభిమానులు.