సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 జూన్ 2020 (17:36 IST)

మైనర్ చెల్లిపై భర్త అత్యాచారం... భర్తనే గొడ్డలితో నరికేసిన నిండు గర్భిణి

నిండు గర్భిణి.. ఇంకా భర్త దగ్గరే వుండాల్సిన పరిస్థితి. దీనికోసం తన 15ఏళ్ల చెల్లిని ఇంటికి తెచ్చుకుంది. అయితే కట్టుకున్న భర్త మైనర్ చెల్లిపై అఘాయిత్యానికి పాల్పడటంతో తట్టుకోలేక భర్తనే దారుణంగా హత్య చేసింది. అంతేగాకుండా భర్త శవాన్ని ఇంటి వెనుక పాతిపెట్టి.. అనంతరం పోసుల ఎదుట లొంగిపోయిన ఘటన రాజస్థాన్‌లో సంచలనం సృష్టించింది.
 
వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్, శిఖర్ సమీపంలోని ఓ గ్రామానికి చెందిన నిండు గర్భిణి.. తన భర్తని దారుణంగా హత్య చేసింది. తొమ్మిది నెలల నిండు గర్భంతో ఉన్న ఆమెకు చేదోడువాదోడుగా ఉండేందుకు ఎనిమిదో తరగతి చదువుతోన్న ఆమె చెల్లెలు.. అక్క ఇంటికొచ్చింది. 
 
కామంతో కళ్లుమూసుకుపోయిన బావ మరదలిపై దారుణానికి ఒడిగట్టాడు.. ఆ విషయం తెలిసి కోపంతో ఊగిపోయిన భార్య.. ఆ విషయాన్ని జీర్ణించుకోలేక.. భర్తని గొడ్డలితో నరికి అతి కిరాతకంగా హత్య చేసింది.. ఆ తర్వాత ఇంటి వెనుక పెరట్లోకి భర్త శవాన్ని లాక్కెళ్లి గొయ్యి తవ్వి పాతిపెట్టింది.
 
అటు పిమ్మట పోలీసుల ఎదుట లొంగిపోయింది.. కేసు నమోదు చేసిన పోలీసులు.. గర్భిణి అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.