శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 3 జూన్ 2020 (10:51 IST)

దేశంలో 2.7లక్షల కరోనా కేసులు.. 217 మంది మృతి.. 8,909 కొత్త కేసులు

భారత్‌లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. మృతుల సంఖ్య కూడా అదే స్థాయిలో ఉంది. గడిచిన 24 గంటల్లో కరోనాతో 217 మంది ప్రాణాలు కోల్పోగా, కొత్తగా 8,909 పాజిటివ్‌ కేసులు నమోదు అయినట్లు కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో ఇప్పటి వరకు 2.7 లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 5,815 మంది కరోనాతో చనిపోయారు. 1,00,303 మంది ఈ వైరస్‌ నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు.
 
ఇకపోతే.. మహారాష్ట్రలో అత్యధికంగా 72,300 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 2,465 మంది మృతి చెందారు. తమిళనాడులో 24,586, ఢిల్లీలో 22,132, గుజరాత్‌లో 17,632, రాజస్థాన్‌లో 9,373, యూపీలో 8,729, మధ్యప్రదేశ్‌లో 8,420, పశ్చిమ బెంగాల్‌లో 6,168, బీహార్‌లో 4,096, కర్ణాటకలో 3,796, ఏపీలో 3,791, తెలంగాణలో 2,891 కేసులు నమోదైనాయి.
 
అలాగే ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు 64 లక్షలు దాటాయి. బ్రెజిల్‌లో వైరస్ ఉధృతి కొనసాగుతోంది. రష్యాలో కరోనా విజృంభిస్తోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా గత 24 గంటల్లో మొత్తం 64,52,390 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 3,82,479 మంది మృతి చెందగా.. కరోనా బారినపడి 30,66,696 మంది కోలుకున్నారు.