విజయ్ మాల్యా అప్పీల్‌ను తోసిపుచ్చిన కోర్టు.. ఇక భారత్‌కు రావాల్సిందేనా?
లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా భారత్‌కు రాకుండా తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. భారత్‌లోని బ్యాంకులను మోసగించినట్లు నమోదైన ఆరోపణలపై విచారణను ఎదుర్కోవడం కోసం.. విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలని ఇదివరకే బ్రిటన్ ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం మంతనాలు జరుపుతోంది.
ఈ నేపథ్యంలో విజయ్ మాల్యాను భారత్‌కు అప్పగించాలని క్రింది కోర్టు కూడా రూలింగ్ ఇచ్చింది. దీనిపై ఆయన యునైటెడ్ కింగ్‌డమ్‌లోని రెండో అత్యున్నత న్యాయస్థానం లండన్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే, హైకోర్టు ఆయన అప్పీలును తోసిపుచ్చింది. అటు సుప్రీం కోర్టులోనూ అప్పీలు చేసుకునేందుకు మాల్యాకు అనుమతి లభించలేదు.
దీంతో విజయ్ మాల్యా చేసుకున్న ప్రయత్నాలన్నీ విఫలం కావడంతో.. అతన్ని స్వదేశానికి రప్పించే ప్రయత్నాలను వేగవంతం చేసింది భారత్. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వంతో భారత్ చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే, మాల్యా.. తాను నూటికి 100 శాతం రుణాలను తిరిగి చెల్లిస్తానని, తనపై కేసును ముగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్న సంగతి తెలిసిందే.