1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
  4. Meerut man makes 12 kg Bahubali samosa

బాహుబలి సమోసా తింటే రూ.71వేల రివార్డు

Bahubali samosa
Bahubali samosa
బాహుబలి సమోసా తింటే రూ.71,000 రివార్డు ప్రకటించగా.. ఇప్పటివరకు ఆ సమోసా ఎవరూ తినలేకపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి.
 
గుజరాత్‌లోని సూరత్‌లోని ఒక హోటల్‌లో ఒక ప్రకటన కోసం 12 కిలోల బాహుబలి సమోసాను ప్రదర్శించారు. 30 నిమిషాల్లో ఈ సమోసా తిన్న వ్యక్తికి రూ.71 వేలు ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు రెస్టారెంట్ ప్రకటించింది.
 
ఈ పోటీలో ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదని, ఒక్కరు మాత్రమే 25 నిమిషాల్లో తొమ్మిది కిలోల వరకు తిని, అంతకు మించి తినలేక పోటీ నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. 
 
కస్టమర్లను ఆకర్షించేందుకు, ప్రకటనల కోసం రెస్టారెంట్ యాజమాన్యం ఈ వ్యూహాన్ని ఉపయోగిస్తుండగా చాలామంది ఈ సమోసా తినేందుకు ముందుకు రావడం గమనార్హం. అయితే ఇప్పటి వరకు ఎవరూ గెలవలేదు కాబట్టి ఇక నుంచి ఎవరైనా గెలుస్తారో లేదో చూడాలి.
తర్వాతి కథనం
నిప్పులు చెరిగే చర్చ- మోజ్ నార్తరన్ విండ్స్ వర్సెస్ సదరన్ ఫైర్ క్యాంపెయిన్