1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 ఫిబ్రవరి 2023 (10:09 IST)

ఉల్లి రైతు కష్టం.. 512 కేజీల ఉల్లికి రూ. 512 మాత్రమే వచ్చింది..

onion
ఉల్లి రైతుల కష్టాలు అంతా ఇంతా కాదు. తాజాగా ఓ మహారాష్ట్ర రైతుకు ఉల్లి అమ్మడంతో కష్టాలు తప్పట్లేదు. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్ర రైతు 512 కేజీల ఉల్లిపాయలు అమ్మడితే రెండు రూపాయలు మాత్రమే మిగలడంతో షాక్ అయ్యాడు. 
 
వేలంలో అతడు తీసుకెళ్లిన ఉల్లికి కేజీకి రూపాయి ధర మాత్రమే పలికింది. అంటే మొత్తం 512 కేజీల ఉల్లికి రూ. 512 మాత్రమే వచ్చింది. ఆ ఉల్లిని కొనుగోలు చేసిన ట్రేడర్ రవాణా చార్జీలు, లోడింగ్, తూకం చార్జీల కింద రూ. 509.51 మినహాయించుకున్నాడు. 
 
మిగిలిన రూ. 2.49లో 49 పైసలను తీసేసి రౌండ్ ఫిగర్ అంటూ రూ. 2 చెక్కును రైతు చేతిలో పెట్టాడు. అది కూడా 15 రోజుల తర్వాత చెల్లుబాటు అయ్యేలా. అది చూసి రైతు చవాన్‌కు కన్నీళ్లు అగలేదు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.