గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. క్రైం న్యూస్
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 29 జనవరి 2023 (13:37 IST)

నవీ ముంబైలో మతిస్థిమితం లేని బాలికపై అత్యాచారం

victim
నవీ ముంబైలో మతిస్థిమితం లేని బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఇద్దరు కామాంధులు ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ విషయాన్ని నవీ ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ ఇద్దరు నిందితులు ఈ నెల 25వ తేదీన డిఘేలోని ఈశ్వర్ నగర్‌కు చెందిన బాలికను అపహరించి ఫ్యాక్టరీ సమీపంలోని ఏకాంత ప్రదేశంపై అత్యాచారానికి పాల్పడ్డారని వారు తెలిపారు. బాలికపై అత్యాచారం చేసిన తర్వాత తిరిగి తీసుకొచ్చి ఇంటివద్ద వదిలివెళ్లారని వెల్లడించారు. బాధిత బాలిక బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 
 
కాగా, దేశంలో నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అమ్మాయిలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. కామాంధులు ఏ ఒక్కరినీ వదిలిపెట్టడం లేదు. పసిబిడ్డల నుంచి వయో వృద్ధులపై అత్యాచారాలు చేస్తున్నారు. ఈ నేరాలు ఘోరాలు, అత్యాచారాల అడ్డుకట్టకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నప్పటికీ ఆగడాలు మాత్రం ఆగడం లేదు.