మంగళవారం, 8 అక్టోబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 17 జూన్ 2023 (07:03 IST)

జపాన్‌లో చట్టబద్ధ శృంగారానికి 16 ఏళ్లు.. బిల్లుకు గ్రీన్ సిగ్నల్

romance
జపాన్‌లో చట్టబద్ధ శృంగారానికి 16 ఏళ్ల వయో పరిమితి పెంచాలనే బిల్లుకు జపాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఈ వయోపరిమితి 13 ఏళ్ల పాటు వుండేది. ప్రపంచంలోనే శృంగారానికి అత్యంత తక్కువ వయసు నిర్దేశించిన దేశం జపానే. 
 
ప్రస్తుతం 13 ఏళ్ల వయోపరిమితిని 16 ఏళ్లకు పెంచుతూ వచ్చిన కీలక బిల్లును చట్టసభ్యుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. పార్లమెంట్ ఎగువ సభలో ఈ బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం లభించింది. ఇక నుంచి 16 ఏళ్ల లోపు బాలికలపై లైంగిక చర్యలు శిక్షార్హం అవుతాయి. 
 
16 ఏళ్ల లోపు ఉన్న బాలికలతో లైంగిక చర్యలు అత్యాచారంగా పరిగణింపబడతాయి. 13 ఏళ్లకు పైబడిన అమ్మాయిలతో శృంగారం అక్కడ నేరం కాదు. 
 
దాంతో బాలికలను బలవంతంగా వ్యభిచార రొంపిలో దింపినా ప్రశ్నించే వీలుండేది కాదు. ఇప్పుడా పరిస్థితి తొలగిపోనుంది. కొత్త చట్టం ద్వారా 13 ఏళ్ల బాలికలకు విముక్తి లభించనుంది.