శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : బుధవారం, 31 మే 2023 (20:36 IST)

నూడిల్స్‌లో బతికున్న కప్ప.. సగం తిన్నాక చూస్తే షాక్

frog
frog
రెస్టారెంట్లలో టేస్టీతో కూడిన ఆహారం తీసుకుందామని కస్టమర్లు వెళ్తుంటారు. అయితే కొన్ని రెస్టారెంట్లలో ఆహార పదార్థాలతో పాటు బొద్దింకలు వంటివి వచ్చే వార్తలు వినే వుంటాం. ప్రస్తుతం ఈ ఘటన వైరల్ అవుతోంది. 
 
ఒక జపనీస్ వ్యక్తి ఒక ప్రముఖ రెస్టారెంట్ చైన్ నుండి టేక్‌అవేకి ఒక కప్పు నూడిల్స్ ఆర్డర్ చేశాడు. ఆ ఆర్డర్ కూడా ఇంటికొచ్చింది. హ్యాపీగా ఆ వ్యక్తి న్యూడిల్స్‌ను కూడా సగం కానిచ్చేశాడు. అయితే సగం డబ్బా ఖాళీ అయ్యాకనే అసలు విషయం తెలియవచ్చింది. 
 
ఆ నూడిల్స్‌లో కూరగాయలతో పాటు ఒక బతికున్న కప్ప కూడా వుంది. కదులుతూ కప్పులో కనిపించడంతో షాక్ అయ్యాడు. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.