1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated: గురువారం, 25 మే 2023 (16:50 IST)

కార్తీ సినిమా జపాన్ నుంచి తాజా అప్డేట్.. ఇంట్రడక్షన్ గ్లింప్స్ రిలీజ్

Japan
Japan
రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. ఈ సినిమా షూటింగ్ కొంతవరకు పూర్తి అయ్యింది. ఇది ఊపిరి ఫేమ్ కార్తీకి 25వ సినిమా. రాజు మురుగన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వస్తున్న సినిమా జపాన్. 
 
ఇక తాజాగా ఈ సినిమా నుండి సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు కార్తీ పుట్టిన రోజు కావడంతో జపాన్ సినిమా కార్తీ ఇంట్రడక్షన్ గ్లింప్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో తొలిసారిగా కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 
 
సునీల్ కూడా "జపాన్"లో ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రంతో సునీల్ తమిళ్ లో అరంగేట్రం చేస్తుండటం మరో విశేషం. ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.