సంబంధిత వార్తలు
- పాకిస్థాన్ ఆయుధగారాన్ని ధ్వంసం చేసిన ఇండియన్ ఆర్మీ!
- పాకిస్థాన్ వక్రబుద్ధి.. బీహార్ ద్వారా భారత్లోకి ఉగ్రవాదులు?
- కరోనాపై నోరెత్తలేదు - కాశ్మీర్ కోసం పాక్కు వంతపాడిన చైనా.. భారత్ వార్నింగ్
- భారత్కు డబ్బులు అక్కర్లేదు.. క్రికెటర్ల ప్రాణాలు ఫణంగా పెట్టలేం : కపిల్ దేవ్
- మున్ముందు పరిస్థితి మరింత దిగజారవొచ్చు... ఇమ్రాన్ ఖాన్
కరోనా లాక్ డౌన్- జీహాదీలను రిక్రూట్ చేసుకుంటున్న ఉగ్రవాద సంస్థలు
పాకిస్థాన్ ప్రేరేపిత లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిద్ధీన్ ఉగ్రవాద సంస్థలు జిహాదీలను రిక్రూట్‌మెంట్ చేస్తున్నాయి. ఈ విషయాన్ని సౌత్ ఏసియా డెమోక్రటిక్ ఫ్రంట్ రీసెర్చ్ డైరెక్టరు డాక్టర్ సియజ్ ఫ్రైడ్ వోల్ప్ చెప్పారు. కరోనా లాక్ డౌన్ అమలులో ఉన్న ప్రస్థుత కష్టకాలంలో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థలు యువకులకు తినడానికి భోజనం, కొంత డబ్బు ఇచ్చి వారిని తమ సంస్థల్లో చేర్చుకుంటున్నారని సమాచారం.
కరోనా వల్ల యువత ఉపాధికి విఘాతం కలిగిన తరుణాన్ని ఆసరాగా తీసుకొని ఉగ్రవాదులు జిహాద్ ప్రచారంతో ఉగ్రసంస్థల్లో వారిని చేర్చుకుంటున్నట్లు వోల్ప్ తెలిపారు. కరోనా కష్టకాలంలో దీన్ని ఆసరాగా తీసుకొని యువతను ఉగ్రవాద సంస్థల్లో చేరేలా ప్రోత్సహిస్తున్నారని పాకిస్థానీ జర్నలిస్టు ఒకరు చెప్పారు. దక్షిణ ఆసియా పరిధిలోని ప్రత్యేకించి ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ దేశాల్లో కరోనా వైరస్ విపత్తు కారణంగా తమ జీవనోపాధి కోల్పోయిన యువతను ఆకర్షిస్తున్నట్లు వోల్ఫ్ తెలిపారు.
తర్వాతి కథనం
