శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (18:09 IST)

పాకిస్థాన్ వక్రబుద్ధి.. బీహార్ ద్వారా భారత్‌లోకి ఉగ్రవాదులు?

పాకిస్థాన్ వక్రబుద్ధి మళ్లీ మళ్లీ బయటపడుతోంది. ఇప్పటికే ప్రపంచ దేశాలు కరోనాతో అట్టుడుకిపోతుంటే.. భారత్‌లో అలజడులు సృష్టించేందుకు పాకిస్థాన్ కుట్రలు చేస్తోంది. మొన్నటికి మొన్న దేశంలోకి కరోనా పాజిటివ్ అని తేలిన ఉగ్రవాదులను ఎల్ఓసీలోకి పంపేందుకు పాక్ ఆర్మీ ప్రయత్నించింది. కానీ ఆ ఉగ్రవాదులు ప్రయత్నాలకు భారత సైన్యం చెక్ పెట్టింది.
 
అయితే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు.. ఆ కరోనా మహమ్మారిని అంటించుకుని.. దేశంలో బయో ఉగ్రవాదానికి తెరలేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకున్న బీహార్ పోలీసులు వీరి కుట్రను భగ్నం చేశారు. 
 
నేపాల్ సరిహద్దుల ద్వారా.. కరోనా పాజిటివ్ ఉన్న ఉగ్రవాదులను భారత్‌లోకి పంపి.. తద్వారా కరోనా వ్యాప్తిని విస్తరింపజేయాలని పాకిస్థాన్‌ ఈ బయో కుట్రలకు తెరలేపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.