మున్ముందు పరిస్థితి మరింత దిగజారవొచ్చు... ఇమ్రాన్ ఖాన్
కరోనా వైరస్ కారణంగా తమ దేశంలో పరిస్థితులు మరింతగా దిగజారవచ్చని పాకిస్థాన్ అధ్యక్షుజు ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. కరోనా వైరస్ బారినపడిన దేశాల్లో పాకిస్థాన్ కూడా ఒకటి. వైరస్‌ను ఎదుర్కొనే క్రమంలో తీవ్రపోరాటం చేస్తున్నా పాకిస్థాన్‌లో కరోనా కేసులు సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఈ కేసులు నాలుగు వేలకు పైగా పెరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ, మున్ముందు ఈ పరిస్థితిని తట్టుకోవడం కష్టమేనని, పరిస్థితి మరింత దిగజారవచ్చని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పాక్‌లో పాక్షికంగానే లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. దేశంలో 5 కోట్లకు పైగా పేదలున్న నేపథ్యంలో పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తే ఆకలి చావులు సంభవిస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రజలు ఆరోగ్యశాఖ సూచనలు పాటించాలని హితవు పలికారు. కాగా, పాకిస్థాన్‌లో కరోనా తీవ్రతతో సామాన్యులు ఇక్కట్లు ఎదుర్కొంటుండటంతో ప్రభుత్వం 'ఎహసాస్ ఎమర్జెన్సీ క్యాష్ ప్రోగ్రామ్' ప్రకటించింది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు నెలకు రూ.12 వేల చొప్పున ఇవ్వనున్నారు.