శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 10 ఏప్రియల్ 2020 (09:55 IST)

కరోనాపై నోరెత్తలేదు - కాశ్మీర్‌ కోసం పాక్‌కు వంతపాడిన చైనా.. భారత్ వార్నింగ్

కరోనాను ప్రపంచ దేశాలకు వ్యాపించేందుకు కారణమైన చైనా ఇప్పటికే ప్రపంచ దేశ ప్రజలు గుర్రుగా వున్నారు. మాంసాహారం పేరిట గబ్బిలాలు, పాములను పిచ్చ పిచ్చగా తిని కరోనా వైరస్‌కు చైనా కారణమైందని ఇప్పటికే ప్రపంచ దేశాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్‌ చైనాకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. 
 
ఓ వైపు కొవిడ్-19పై ఐరాసలో సమావేశం ఏర్పాటు చేయకపోవడంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న చైనా నాయకత్వం.. పాకిస్తాన్‌కు మాత్రం వంతపాడింది. వాస్తవానికి కొవిడ్-19పై ఐరాస భద్రతా మండలిలో చర్చ జరగడం చైనాకి ఇష్టం లేదనీ.. అదే జరిగితే వైరస్ వ్యాప్తిపై మరిన్ని నిజాలు బయటికి వస్తాయిని డ్రాగన్ భయపడుతోందని యూఎన్ఎస్‌సీ సభ్యదేశాలు భావిస్తున్నాయి.
 
ఇలాంటి పరిస్థితుల్లో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అజెండాలో కాశ్మీర్ అంశాని అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని చైనా ప్రతిపాదించడాన్ని భారత్ తీవ్రస్థాయిలో మండిపడింది. జమ్మూ కాశ్మీర్ అంశం భారత అంతర్గత వ్యవహారమని మరోసారి తేల్చిచెప్పింది. 
 
''ఐక్య రాజ్య సమితిలో చైనా శాశ్వత ప్రతినిధి జమ్మూ-కాశ్మీర్‌పై చేసిన సూచనలను తిరస్కరిస్తున్నాం. ఈ అంశంపై భారత్ వైఖరి ఏంటో చైనాకి తెలుసు. కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్ ఇప్పటికీ, ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమే. జమ్మూ కాశ్మీర్‌కి సంబంధించిన వ్యవహారాలు కూడా భారత్‌లో అంతర్భాగమే...'' అని భారత విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది.  
 
జమ్మూ కాశ్మీర్ వ్యవహారంపై ఇంతకుముందు పాకిస్థాన్‌కు చైనా వంతపాడింది. యూఎన్ఎస్‌సీ అజెండాలో కశ్మీర్ అంశానికి ''అత్యధిక ప్రాధాన్యత'' ఇవ్వాలంటూ మార్చి 10న పాకిస్తాన్ తమకు రాసిన లేఖపై వెంటనే స్పందించామని పేర్కొంది. ఈ విషయాన్ని యూఎన్‌ఎస్‌సీలో లేవనెత్తుతామని చెప్పుకొచ్చింది. దీనిపై ఎలాంటి సమావేశం జరక్కుండానే ఐరాసలోని చైనా రాయబారి ఝంగ్ జున్ ఏకంగా పాకిస్తాన్ లేఖను భద్రతా మండలి అధికారిక తీర్మానంలాగా ప్రచారం చేశారు. దీనిపై భారత్ చైనాపై గుర్రుగా వుంది.