శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2020 (23:13 IST)

కరోనాతో పోరాటం.. లాక్ డౌన్ బెస్ట్.. ఇంట్లోనే వుండిపోతాం..

కరోనా నేపథ్యంలో.. లాక్ డౌన్‌లో వున్న ప్రజలంతా బయటికి రావాలనుకుంటారని అందరూ భావించారు. కానీ ఇప్సోస్ పోల్ సర్వేలో భారతదేశంలో 84 శాతం మంది కరోనా మహమ్మారిని నివారించడానికి ఇళ్లకే పరిమితమాయ్యారని.. ఇంకా మొత్తం భారత్‌తో సహా 14 దేశాల్లో ప్రతీ 5 మందిలో నలుగురు ఇంట్లో ఉండడానికే ఇష్ట పడుతున్నారని ఇప్సోస్ ఇండియా పేర్కొంది.
 
ప్రపంచంలో అధిక భాగం దేశాలు స్వచ్ఛంధంగా లాక్ డౌన్ పాటిస్తున్నాయని వెల్లడించింది. కాగా రష్యా, వియత్నాం, ఆస్ట్రేలియా ప్రజలు స్వీయ నియంత్రణలో ఉండేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారని సర్వేలో వెల్లడించింది. ఇక దేశాల వారిగా చూస్తే స్పెయిన్‌ 95 శాతంతో అగ్రస్థానంలో ఉంది. భారత్‌ ఈ జాబితాలో అమెరికాతో సంయుక్తంగా 84 శాతంతో ఏడవ స్థానంలో కొనసాగుతుంది.
 
అంతేగాక 15 దేశాల్లో దాదాపు 14 దేశాల ప్రజలు హోమ్‌ క్వారంటైన్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇంట్లో ఉంటేనే కరోనా బారీ నుంచి రక్షించుకోగలమని భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. భారత్‌లో లాక్ డౌన్ ఏప్రిల్ 14తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగిస్తే మంచిదని ఇప్పటికే అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాని మోదీకి సూచించారు.