మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By సెల్వి
Last Updated : గురువారం, 9 ఏప్రియల్ 2020 (21:19 IST)

వ్యాక్సిన్ వచ్చే వరకు కరోనా వదలదు.. ఇంకా 18 నెలల టైమ్ పడుతుంది..?

భారత్‌లో ఇప్పటికిప్పుడు లాక్‌డౌన్ ఎత్తేసే పరిస్థితులు కనిపించడం లేదని అమెరికాలోని హార్వర్డ్ గ్లోబల్ హెల్త్ ఇనిస్టిట్యూట్‌ డైరెక్టర్ ప్రొఫెసర్ ఆశిష్‌కుమార్ ఝా చెప్తున్నారు. ఒకవేళ ఎత్తేసినా.. భారత్‌లో మళ్లీమళ్లీ లాక్‌డౌన్లు వస్తూనే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 
 
అలాగే కరోనాపై ఆశిష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా వైరస్ ఇప్పట్లో మనల్ని వదిలిపెట్టదని, వ్యాక్సిన్ తయారు చేసే వరకు అది మనల్ని వదలదన్నారు. అంటే ఇంకా 12 నుంచి 18 నెలల సమయం పడుతుందని బాంబు పేల్చారు. 
 
అయితే కరోనా నుంచి తప్పించుకోవాలంటే రెండు మూడు మార్గాలే ఉన్నాయని చెప్పారు. అందులో ఒకటి మనం సామాజిక దూరం పాటించడం, రెండోది పరీక్షలు చేయించడం. మూడోది ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడమని పేర్కొన్నారు. వ్యాక్సిన్ వచ్చేదాకా అప్రమత్తంగా ఉండాల్సిందేనని హెచ్చరించారు. ఇదే సమయంలో భారత్ కరోనాపై చేస్తున్న పోరాటంపై కూడా ప్రస్తావించారు. 
 
అద్భుతమైన మేధోశక్తి భారత్ సొంతం అని కొనియాడారు. నిజానికి.. నమ్మశక్యం కాని ప్రతిభ భారత్‌లో ఉంది. స్థానికంగానే.. తక్కువ ఖర్చుతో నిర్ధారణ పరీక్షల సమాగ్రిని కూడా తయారు చేయగల శక్తిసామర్థ్యాలు భారత్‌కు ఉన్నాయని కితాబిచ్చారు.