1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
  4. WhatsApp Services Restored After Hours of Global Outage

మళ్లీ వాట్సాప్ సేవలు పునరుద్ధరణ

whatsapp
ప్రపంచ వ్యాప్తంగా వాట్సాస్ సేవలు స్తంభించిపోయాయి. దాదాపు రెండు గంటలపాటు అందుబాటులో లేకుండాపోయాయి. దీంతో రంగంలోకి దిగిన వాట్సాప్ టెక్నికల్ విభాగంగా సాంకేతిక సమస్య లోపాన్ని సరిచేసింది. వాట్సాప్ సేవలను తిరిగి పునరుద్దరించింది. 
 
వాట్సాప్ సేవలు మంగళవారం దేశ వ్యాప్తంగా స్తంభించిపోయాయి. పంపించిన మెసేజ్‌లు డెలివరీ లేదా రిసీవ్ అయినట్టుగా స్టేటస్ చూపించకపోవడంతో వాట్సాప్ వినియోగదారుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఈ సేవల అంతరాయంపై వాట్సాప్ యాజమాన్యం మాత్రం అధికారికంగా స్పందించలేదు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సేవలు ఆగిపోయాయి. 
 
వాట్సాప్‌లో పంపించిన మెసేజ్‍‌లకు డెలివరీ అయినట్టుగా స్టేటస్ (టిక్ మార్క్) కూడా కనిపించలేదు. అయితే, దీనిపై వాట్సాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నట్టు సమాచారం. గంట లేదా గంటన్నర వ్యవధిలో ఈ సాంకేతిక సమస్యకు పరిష్కారం కనుగొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు, వాట్సాప్ సేవలు ఒక్కసారిగా ఆగిపోవడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏం జరుగుతుందో అర్థంకాక గందరగోళానికి గురయ్యారు. ఆ తర్వాత రెండు గంటల పాటు టెక్నికల్ టీమ్ శ్రమించి ఈ సేవలను తిరిగి పునరుద్దరించింది. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
బ్రిటన్ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రిషి సునాక్