1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 25 అక్టోబరు 2022 (14:17 IST)

ప్రపంచ వ్యాప్తంగా స్తంభించిన వాట్సాప్ సేవలు.. కనిపించని డెలివరీ స్టేటస్

whatsapp
ప్రముఖ సోషల్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సేవలు మంగళవారం దేశ వ్యాప్తంగా స్తంభించిపోయాయి. పంపించిన మెసేజ్‌లు డెలివరీ లేదా రిసీవ్ అయినట్టుగా స్టేటస్ చూపించకపోవడంతో వాట్సాప్ వినియోగదారుల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే, ఈ సేవల అంతరాయంపై వాట్సాప్ యాజమాన్యం మాత్రం అధికారికంగా స్పందించలేదు. దాదాపు 40 నిమిషాల పాటు ఈ సేవలు ఆగిపోయాయి. 
 
వాట్సాప్‌లో పంపించిన మెసేజ్‍‌లకు డెలివరీ అయినట్టుగా స్టేటస్ (టిక్ మార్క్) కూడా కనిపించలేదు. అయితే, దీనిపై వాట్సాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తున్నట్టు సమాచారం. గంట లేదా గంటన్నర వ్యవధిలో ఈ సాంకేతిక సమస్యకు పరిష్కారం కనుగొనే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు, వాట్సాప్ సేవలు ఒక్కసారిగా ఆగిపోవడంతో యూజర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏం జరుగుతుందో అర్థంకాక గందరగోళానికు గురయ్యారు.