మణిశర్మ సంగీతం హైలైట్ గా గజ సినిమా విజయం ఖాయం : సాయి రాజేష్
Mani Sharma, Sai Rajesh, Farnaz Shetty, Seven Hills Satish, Dr. Maitri Saran
సాయి రాజేష్ మాట్లాడుతూ* .. గజ టీజర్ ఇంప్రెసివ్‌గా అనిపించింది. నాకు సతీష్‌తో ఎన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా ఈ సినిమాని వదల్లేదు. కష్టపడి ఈ స్థాయికి తీసుకు వచ్చాడు. రామ్ మిర్యాల వాయిస్ అంటే నాకు ఇష్టం. మణిశర్మ గారిని, రామ్ మిర్యాలని కలిపి క్రెడిట్ తీసుకోవాలని అనుకున్నాను. కానీ ఆల్రెడీ సతీష్ ఆ క్రెడిట్ తీసుకున్నాడు. మళ్లీ మేం ముగ్గురం కలిసి ఓ గొప్ప పాటను చేయాలని అనుకుంటున్నాను. మా సతీష్ గారికి సపోర్ట్ చేస్తున్న మైత్రి శరణ్ గారికి ధన్యవాదాలు. ఫర్నాజ్ గారు తెలుగులో చక్కగా మాట్లాడారు. మణిశర్మ గారితో నాకు ఎన్నో బెస్ట్ మెమోరీస్ ఉన్నాయి. ఇకపై నేను మణి సార్‌తోనే ట్రావెల్ చేస్తాను. ఆయన ట్రాక్ క్వాలిటీని కూడా ఎవ్వరూ బీట్ చేయలేరు. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
హీరో, నిర్మాత, దర్శకుడు సతీష్ జై మాట్లాడుతూ, ఈ సినిమాకి, నాకు మణిశర్మ గారు బ్యాక్ బోన్‌లా నిల్చున్నారు. ఆయన్నుంచి నేను క్రమశిక్షణ, డెడికేషన్ గురించి తెలుసుకున్నాను. సాయి రాజేష్ గారు ఎప్పుడూ ఓ ఫ్రెష్ కంటెంట్‌ని తీసుకుంటారు. సాయి రాజేష్ గారికి మంచి మ్యూజిక్ టేస్ట్ ఉంటుంది. ఈ రోజు మా కోసం ఆయన రావడం సంతోషంగా ఉంది. ఫర్నాజ్ మంచి నటి. ఈ సినిమాకి ఫర్నాజ్ హీరో. కమర్షియల్ అంశాలతో పాటు సెల్యూట్ కొట్టేలా మంచి మెసెజ్, ఎమోషన్ కూడా ఉంటుంది అని అన్నారు.
*మణిశర్మ మాట్లాడుతూ* .. మా సతీష్ గజ సినిమాని ఎన్నో కష్టాలు, సవాళ్లని ఎదుర్కొని చేశాడు. మూవీ అద్బుతంగా వచ్చింది. అల్లకల్లోలంగా ట్యూన్ అద్భుతంగా కుదిరింది. ఈ మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
*నిర్మాత మైత్రి శరణ్ మాట్లాడుతూ* .. గజ టీజర్ అందరికీ నచ్చింది. అంతటి ఆదరణ లభిస్తుందని మేం కూడా ఊహించలేదు. కంటెంట్ బాగుంటే చిన్న సినిమానా? పెద్ద సినిమానా? అన్నది ఆడియెన్స్ చూడటం లేదు. మాకోసం ఈ రోజు సాయి రాజేష్ గారు రావడం, సాంగ్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. మణిశర్మ గారితో పని చేయడం మా కల. అసలు ఆయన మాకు ఓకే చెప్తారా? అని అనుకున్నాం. ఆయన ఇచ్చిన బీజీఎం, పాటలు అందరినీ ఆకట్టుకుంటాయి. మిట్టపల్లి గారు మంచి సాహిత్యాన్ని ఇచ్చారు. మా సినిమాని థియేటర్లో చూసి విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.
*ఫర్నాజ్ శెట్టి మాట్లాడుతూ* .. గజ సినిమాలో భాగం అవ్వడం నాకు ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఈ మూవీలో పని చేసిన ప్రతీ ఒక్కరికీ, నాకు సపోర్ట్ చేసిన అందరికీ థాంక్స్. ఈరోజు మాకోసం వచ్చిన సాయి రాజేష్ గారికి ధన్యవాదాలు. సినిమాని ప్రతీ ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు అని అన్నారు.
*సెవెన్ హిల్స్ సతీష్ మాట్లాడుతూ* .. గజ సినిమాని మళ్లీ చూశాను. మూవీలో కంటెంట్ ఉంటేనే ఆడియెన్స్ చూస్తారు. మాకు మంచు మనోజ్ గారు, మణిశర్మ గారు, సాయి రాజేష్ గారు, మైత్రి మూవీస్ శుభసూచికంగా కనిపిస్తున్నారు. అల్లకల్లోలం పాటతో మా సతీష్ అల్లకల్లోలం సృష్టిస్తాడు అని అన్నారు.
*లిరిసిస్ట్ మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ* .. గజ చిత్రంలో మంచి పాటలు రాసే అవకాశం ఇచ్చిన జై అన్నకి థాంక్స్. మణిశర్మ గారి మ్యూజిక్ వింటూ పెరిగాం. ఆయన ట్యూన్స్‌లో మా టీన్స్ గడిచింది. ఆయన సంగీతానికి పాటలు రాసే అవకాశం రావడం నా అదృష్టం. నా కల నెరవేరింది అని అన్నారు.
