1. ఇతరాలు
  2. »
  3. వెబ్‌దునియా స్పెషల్ 08
  4. »
  5. మకర సంక్రాంతి

నారాయణ... శ్రీమణ్ణారాయణ...

నారాయణ శ్రీమణ్ణారాయణ విష్ణుమూర్తి ధనుర్మాసం
విష్ణు మూర్తికి ధనుర్మాసం ప్రీతికరమైన రోజులలో సఫల ఏకాదశి ఒకటి. ధనుర్మాసం ప్రారంభం నుంచి ఆ విశ్వమూర్తిని భక్తితో సేవించినవారికి సకల శుభములు చేకూరతాయి. అందుకే ఈ మాసంలో భక్తులు నారాయణార్చన, విష్ణు సహస్రనామ పారాయణం ఆచరిస్తారు.

పవిత్రమైన ధనుర్మాసంలో విష్ణుమూర్తిని కొలిచిన విధానం... ఆ దేవదేవుడు ప్రసన్నుడవటంపై ఓ చిన్న కథ ఉంది. విష్ణుచిత్తుని కుమార్తె శ్రీ గోదాదేవి శ్రీ రంగనాధుని వరించి స్వామివారిని అలంకరించాల్సిన పూలమాలను తాను ధరించేది. అంతేకాదు వాటి సౌందర్యానికి మురిసిపోయి తాను ధరించిన పూలమాలలను స్వామివారికి అలంకరించేది.

అంతేకాదు శ్రీమణ్ణారాయణుని పతిగా కోరి ధనుర్మాస వ్రతం ఆచరించేది. చివరికి స్వామివారి అనుగ్రహానికి పాత్రురాలైన గోదాదేవి స్వామిని చేపట్టింది. అది ఈ ధనుర్మాసంలోనే జరిగింది. కనుక ధనుర్మాసంలో విష్ణుమూర్తిని భక్తితో కొలిచినవారి కోరిన కోర్కెలు తీరగలవు.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT