1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
  4. Kamal Haasan's look test completed – shooting to begin soon.

Kamal Haasan: కమల్ హాసన్ లుక్ టెస్ట్‌ పూర్తి - త్వరలో షూటింగ్

Kamal Haasan's look
Kamal Haasan's look
కమల్ హాసన్ హీరోగా రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ కొత్త సినిమా ప్రకటించింది. ఈ చిత్రానికి ఎస్.యు. అరుణ్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని ఆర్‌కేఎఫ్‌ఐ (రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్), టర్మరిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై నిర్మించనున్నారు.  అనౌన్స్‌మెంట్ పోస్టర్ సినిమా వరల్డ్‌పై ఆసక్తిని పెంచుతోంది.
 
ఈ పోస్టర్‌లో కమల్ హాసన్ సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో, గడ్డంతో, బ్లాక్ షర్ట్, ఆలివ్ గ్రీన్ ట్రౌజర్స్‌లో కనిపిస్తున్నారు.  పవర్‌ఫుల్‌గా కనిపించే లుక్‌కు చేతిలో పట్టుకున్నఆయుధం మరింత ఇంటెన్స్‌నెస్ తీసుకొచ్చింది. ఎంతో కూల్‌గా కనిపిస్తూనే, భారీ ఆయుధంతో నడుస్తున్న కమల్ హాసన్ లుక్.. ఆయన పాత్ర ఎలా ఉండబోతోందనే ఆసక్తిని కలిగిస్తోంది.
 
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా లుక్ టెస్ట్‌ను నిన్న నిర్వహించారు. ఈ లుక్ టెస్ట్‌కు సంబంధించిన కొన్ని గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
 
‘సేతుపతి’, ‘చిత్తా’ వంటి సినిమాలతో ఎస్.యు. అరుణ్ కుమార్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బలమైన పాత్రలను ఆసక్తికరమైన కథనంతో మిళితం చేయడంలో పేరుపొందారు. ఆయన కమల్ హాసన్‌తో కలిసి పనిచేయడం ఈ కొత్త ప్రాజెక్ట్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
 
లుక్ టెస్ట్ విజయవంతంగా పూర్తవడంతో సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
 
ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, టెక్నికల్ టీమ్, సినిమా టైటిల్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
About Writer
దేవీ
దేవీ (మురళీకృష్ణ)  నిక్‌నేమ్- శక్తిమాన్ సినిమా రంగంలో దాదాపు 26 ఏళ్ల అనుభవం ఉంది. కళారంగంపై ఇంట్రెస్టుతో రిపోర్టర్‌గా కెరీర్ మొదలైంది. అలా చేస్తూనే విజయవాడలో రంగస్థలంపై నాటకాల్లో పాత్రలు పోషించారు. అలా ఆర్టిస్టుగా.. పలు సినిమాలు, సీరియల్స్‌లో సైతం నటించారు. స్క్రిప్ట్ వర్క్‌లో కూడా కొద్దికాలం చేశారు. అలా ప్రజాశక్తి దినపత్రికలో సినిమా పేజీ న్యూస్ రిపోర్టర్‌గా తనతోనే ఆరంభం అయింది. అలా చేస్తుండగానే మెగాస్టార్ చిరంజీవి గారితో ఇంటర్వ్యూ చేశాక...... మరింత చదవండి
తర్వాతి కథనం
Taapsee Pannu: కొన్ని కథలు సిగ్గుచేటుగా అనిపిస్తున్నాయ్.. అందుకే రిటైర్ మెంట్ బెటర్ : తాప్సీ