1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ వార్తలు
  4. Panjagutta to Become the Country’s First AI Police Station... Powered by Artificial Intelligence from Complaints to Charge Sheet

మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్... సమస్య నోటితో చెబితే ఎఫ్ఐఆర్ కాపీ సిద్ధం.. ఎక్కడ?

punjagutta police station - cv anand
ప్రపంచంలో అందుబాటులోకి వస్తున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని, ఉపయోగించుకోవడంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు ఒక అడుగు ముందే ఉంటున్నారు. ఇపుడు ఏఐ టెక్నాలజీతో ఎఫ్.ఐ.ఆర్ కాపీలను సిద్ధం చేస్తున్నారు. బాధితుడు సమస్యను నోటితో చెబితే ఎఫ్.ఐ.ఆర్ కాపీ సిద్ధమైపోతోంది. ఆ తరహా టెక్నాలజీని పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో అందుబాటులోకి తెచ్చి మోడల్ ఏఐ పోలీస్ స్టేషన్‌గా మార్చారు. 
 
ఈ స్టేషన్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ఏఐ ఆధారిత వ్యవస్థల పనితీరును రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ పర్యటనలో ఆయన వెంట అడిషినల్ డీజీపీ అకుల్ సబర్వాల్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తదితర పోలీస్ ఉన్నతాధికారులు ఉన్నారు. 
 
ఈ సందర్భంగా సీవీ ఆనంద్ మాట్లాడుతూ, కృత్రిమ మేధ త్వారా పోలీస్ సేవల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని తెలిపారు. పైలెట్ ప్రాజెక్టుగా తొలిసారి పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఏఐ వ్యవస్థను అందుబాటులోకి తెచ్చినట్టు పేర్కొన్నారు. ఇకపై బాధితులు పోలీస్ అధికారుల కోసం గంటల తరబడి స్టేషన్‌లో ఎదురు చూడాల్సిన అవసరం లేదన్నారు. ఫిర్యాదుదారులు ఏఐ యంత్రం ముందు నిలబడి తమ సమస్యను నోటితో వివరిస్తే చాలని, ఆ యంత్రమే బాధితులు చెప్పిన వివరాలతో ఫిర్యాదు కాపీని స్వయంగా తయారు చేస్తుందని వివరించారు. 
 
ఆ తర్వాత ఆటోమేటిక్‌గా సంబంధిత పోలీస్ అధికారులకు ఆ ఫిర్యాదు చేరుతుందని డీజీపీ తెలిపారు. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకోవడం ద్వారా ప్రజలకు పోలీస్ సేవలను సత్వరమే చేరవేయవచ్చని, బాధితుల నుంచి వచ్చే సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ఈ సరికొత్త విధానం ఎంతగానో దోహదపడుతుందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
ఓజార్క్ పర్వతంలో 13 ఏళ్ల క్రితం అదృశ్యమైన విమానం.. 212 మంది ఆచూకీ ఏమైంది?