king 100: నాగార్జున పుట్టినరోజు న కింగ్ 100 మూవీ టైటిల్ గ్లింప్స్ రిలీజ్
King 100 posters
ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్ర టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. తమ అభిమాన హీరో 100వ సినిమాకు ఎలాంటి టైటిల్ పెట్టబోతున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ఈ చిత్రంలో నటి టబు కీలక పాత్రలో నటిస్తున్నారు. నిన్నే పెళ్లాడతా, ఆవిడ మా ఆవిడే వంటి చిత్రాల్లో నాగార్జునతో కలిసి నటించిన టబు.. చాలా కాలం తర్వాత మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం సినిమాపై అంచనాలను పెంచుతోంది.
భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్ గ్లింప్స్‌తో పాటు సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను కూడా మేకర్స్ వెల్లడించనున్నారు.
నాగార్జున పుట్టినరోజుకు మరో మూడు రోజులు మాత్రమే ఉండటంతో #King100 టైటిల్ గ్లింప్స్‌పై ఆసక్తి మరింత పెరుగుతోంది.

