1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. 1-Year-Old Drinks Thinner Mistaking It For Water In Gurugram

మంచినీళ్లుగా భావించి పెయింట్ థిన్నర్ తాగిన చిన్నారి మృతి

1-Year-Old
హర్యానాలో పెయింట్ థిన్నర్ తాగి ఓ చిన్నారి మృతి చెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.
కడుపులో విపరీతమైన నొప్పితో స్పృహ కోల్పోయి, ఆదివారం గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా ఒకటిన్నర సంవత్సరాల బాలుడు మరణించాడని వారు తెలిపారు. 
 
వివరాల్లోకి వెళితే.. హక్షన్ కుటుంబం వివాహ వేడుకకు హాజరైన సమయంలో ఈ సంఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ వేడుక ఓ ఇంట్లో జరుగుతోందని, కొన్ని వారాల క్రితం రంగులు వేయించామని, థిన్నర్‌ను అప్పుడే కొన్నామని చెప్పారు.
 
ఆడుకుంటున్న హ‌క్ష‌న్ దానిని నీళ్ల‌గా భావించి థిన్నర్‌ను తాగేశాడు. చివరికి ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఆ బాలుడు హర్యానాలోని పల్వాల్ జిల్లా జలాల్‌పూర్ గ్రామ నివాసి.
తర్వాతి కథనం
ట్రేడింగ్ పేరిట మోసం.. పార్ట్ టైమ్ జాబ్ కోసం ఆశిస్తే.. రూ.55 లక్షలు స్వాహా