ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 నవంబరు 2023 (21:35 IST)

మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం.. ఆపై హత్య.. ఎక్కడ?

rape
బీహార్‌లో మూడేళ్ల చిన్నారిని లైంగిక వేధింపులకు గురిచేసి హతమార్చిన కీచకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో పోలీసులు జోక్యం చేసుకుని ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టయిన వ్యక్తి లాల్‌బాబు (20) అని పోలీసులు గుర్తించారు. 
 
వివరాల్లోకి వెళితే.. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. తల్లిదండ్రులతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్న చిన్నారిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశాడు నిందితుడు. ఆపై మూడేళ్ల చిన్నారి అవశేషాలను ఖననం చేశాడు.
 
ఇంటికి 200 మీటర్ల దూరంలోని పొలంలో చిన్నారి మృతదేహం లభ్యమైంది. శనివారం సాయంత్రం లాల్ బాబు బాలికతో మాట్లాడాడని తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఇతనిపై ఇలాంటి పలు కేసులు పెండింగ్ వున్నట్లు తెలుస్తోంది.