శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (19:09 IST)

ఆడ, మగ విద్యార్థులు కలసి ఒకే చోట కూర్చుంటే..?

Students
బీహార్ కాలేజీ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఆడ, మగ విద్యార్థులు కలసి ఒకే చోట కూర్చోవద్దని, స్నేహపూరితంగా మాట్లాడుకోవద్దంటూ నిషేధం విధించింది. దీంతో విద్యార్థులు నుండి తీవ్ర వ్యతిరేకత మొదలైంది. వాన్ జిల్లాలో జా ఇస్లామియా పీజీ కాలేజ్ (మైనారిటీ) హుకుం జారీ చేసింది. 
 
మహిళా,పురుష విద్యార్థులు కలిసి పక్క పక్కన కూర్చున్నా, సన్నిహితంగా మెలిగినా కాలేజ్ నుండి సస్పెండ్ చేస్తామని కళాశాల యాజమాన్యం తెలిపింది. 
 
నిజానికి అది బాలుర కళాశాల.. ఇటీవల సంవత్సరాల్లో యువతులను కూడా చేర్చుకుంటున్నారు.  క్రమశిక్షణ కోసం ఇలాంటి కఠినమైన చర్యలు తీసుకుంటున్నట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది.