1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (22:29 IST)

నడిరోడ్డుపై పోలీసులు చొక్కా పట్టుకుని కొట్టుకున్నారు

cops
cops
నడిరోడ్డుపై పోలీసులు చొక్కా పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన బీహార్‌లో చోటుచేసుకుంది. బీహార్ రాష్ట్రం, నలందా జిల్లాలోకు చెందిన పరిధిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఆ సమయంలో ఓ పోలీస్ అధికారం లంచం పుచ్చుకున్నట్లు తెలిసింది. 
 
దీనిని మరో పోలీస్ అధికారి ఖండించారు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో ఇద్దరి మధ్య మాటామంతి పెరిగి ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డారు.
 
పట్టపగలు పోలీసులు ప్రధాన రహదారిపై దాడి చేసుకోవడం చూసి జనం తిట్టుకున్నారు. ఈ తతంగాన్ని ప్రజలు వీడియో తీసి సామాజిక వెబ్‌సైట్లలో షేర్ చేశారు. 
 
ఈ వీడియో వైరల్‌గా మారడంతో పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. రోడ్డుపై గొడవ పడిన 2 పోలీసులు కేసు నమోదు చేసినట్లు అధికారులు తెలిపారు.