బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : ఆదివారం, 17 సెప్టెంబరు 2023 (14:21 IST)

నడి రోడ్డుపై ప్రేమ జంట బరితెగింపు... ప్రేమపక్షులను గుర్తించే పనిలో పోలీసులు

kissing stunts
ఇటీవలి కాలంలో ప్రేమికులు బహిరంగ ప్రదేశాల్లో బరితెగించి ప్రవర్తిసున్నారు. బహిరంగ ప్రదేశాలలో వికృత చేష్టలకు పాల్పడడం ప్రధానంగా ఆ వీడియోలలో కనిపిస్తుంది. అందులోనూ కదులుతున్న వాహనాలపై ముద్దు, కౌగింతలలో మునిగిపోవడం చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి చాలా వీడియోలు బయటకు వచ్చాయి కూడా. తాజాగా ఇదే కోవలో రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఓ ఘటన జరిగింది. దాని తాలూకు వీడియో ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
 
వేగంగా వెళ్తున్న బైక్ మీద ఓ ప్రేమ జంట రెచ్చిపోయింది. ప్రమాదకరమైన కిస్సింగ్ స్టంట్ చేస్తూ కెమెరా కంటికి చిక్కింది. ఆ వీడియో కాస్తా బయటకు రావడంతో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. దీంతో పోలీస్ అధికారులు సదరు ప్రేమ జంటపై చర్యలకు ఆదేశించారు. వీడియోలోని దృశ్యాలను పరిశీలిస్తే.. వేగంగా వెళ్తున్న బైక్‌పై యువతి, యువకుడు ఒకరినొకరు ముద్దుపెట్టుకోవడం వీడియోలో ఉంది. జైపూరులోని దుర్గాపుర ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అక్కడి సీసీటీవీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. వీడియో బయటకు రావడం, పోలీసుల దృష్టికి కూడా వెళ్లడంతో ఆ ప్రేమపక్షులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.