గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 26 సెప్టెంబరు 2023 (13:32 IST)

ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్.. స్పెయిన్‌లో కలకలం.. ఏమైంది?

woman
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పటికే ఉద్యోగ అవకాశాలు సన్నగిల్లుతాయని ఆందోళన ఎప్పటి నుంచో వున్నాయి. తాజాగా స్పెయిన్‌లోని ఓ నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను సద్వినియోగం చేసుకుంటే చాలా క్లిష్టతరమైన పనులు సులభతరం అవుతున్నాయి. 
 
అయితే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను దుర్వినియోగం చేసుకుంటున్నారనేందుకు ఈ ఘటనే నిదర్శనం. తాజాగా స్పెయిన్‌లోని ఓ నగరంలో దారుణం చోటు చేసుకుంది. కొంతమంది స్థానిక బాలికల నగ్న చిత్రాలను ఏఐ ద్వారా మీడియా ఫ్లాట్ ఫామ్‌లో పోస్టు చేశారు. ఈ ఫోటోలు 11-17 ఏళ్ల లోపు గల బాలికలకు చెందినవి. 
 
ఈ చిత్రాలు చూసి బాలికలతో పాటు వారి తల్లిదండ్రులు చూసి షాకయ్యారు. ఈ ఫోటోలపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. విచారణలో 11మంది అబ్బాయిలు ఈ చిత్రాలను రూపొందించారని తెలిసింది. ఆపై వీటిని వాట్సాప్, టెలిగ్రామ్ యాప్‌ల ద్వారా షేర్ చేశారు.