1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. CBSE relaxes three language policy for Class 7, 8, 9; allows two foreign language option

టెన్త్ విద్యార్థులకు శుభవార్త చెప్పిన సీబీఎస్ఈ

cbse logo
త్రిభాషా విధానంపై టెన్త్ విద్యార్థులకు సీబీఎస్ఈ శుభవార్త చెప్పింది. ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇందులోభాగంగా, ప్రస్తుతం పదో తరగతిలో ఉన్న విద్యార్థులకు మూడు భాషల చదవాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇందులోభాగంగా, కొత్త మార్గదర్శకాలను విడులను విడుదల చేసింది. 
 
2026-27 విద్యా సంవత్సరంలో ఈ నిబంధన నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఒకసారి మాత్రమే వర్తించే వెసులుబాటును కల్పిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుత పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు మూడు భాషలను చదవాల్సి ఉంటుందని.. కానీ వారు రెండు విదేశీ భాషలను.. ఒక భారతీయ భాషను ఎంచుకోవచ్చని వెల్లడించింది. 
 
జులై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడు భాషలు అభ్యసించాలని సీబీఎస్‌ఈ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ ఆదేశాలపై పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సీబీఎస్‌ఈ తాజా ప్రకటన చేసింది. 'ప్రస్తుత 10వ తరగతి బ్యాచ్ త్రిభాషా విధానాన్ని పాటించాల్సిన అవసరం లేదు. అలాగే, ప్రస్తుతం 7 నుంచి 9 తరగతుల్లో ఉన్న విద్యార్థులు 10వ తరగతికి వెళ్ళినప్పుడు థర్డ్‌ లాంగ్వేజీ బోర్డు పరీక్షలు రాయాల్సిన అవసరం ఉండదు' అని సీబీఎస్‌ఈ అకడమిక్స్ డైరెక్టర్ ప్రజ్ఞా ఎం. సింగ్ తెలిపారు. అనవసర ఒత్తిడి తగ్గించేందుకే ఈ ఏర్పాటు చేశామని.. ఆ పాఠ్యాంశానికి పాఠశాలల్లో చూపే ప్రతిభ ఆధారంగానే మార్కులు కేటాయిస్తారని పేర్కొన్నారు. 
About Writer
ఠాగూర్
ఠాగూర్ పులపాక ప్రముఖ దినపత్రిక ఈనాడు, చెన్నై కార్యాలయంలో 'న్యూస్ కాంట్రిబ్యూటర్‌'గా జర్నలిజం ఓనమాలు నేర్చుకున్నారు. హైదరాబాద్ కార్యాలయంలో 'ఆంధ్రజ్యోతి' సబ్-ఎడిటర్ పని చేశారు. 2007 నుంచి 'వెబ్ దునియా'లో అసిస్టెంట్ ఎడిటర్‌‌గా విధులు నిర్వహిస్తున్నారు..... మరింత చదవండి
తర్వాతి కథనం
చెరువులో మృతదేహాలను తాళ్లతో బైకుకు కట్టి ఉంచారు.. ఎక్కడ?