1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Centre forms panel on 'One Nation One Election' under former President Kovind

"ఒకే దేశం - ఒకే ఎన్నికలు" : రాంనాథ్ కోవింద్ సారథ్యంలో కమిటీ

ramnath kovind
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా 'ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలు' నిర్వహించేందుకు మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ సారథ్యంలో నిపుణుల కమిటీని శుక్రవారం ఏర్పాటుచేసింది. దేశ వ్యాప్తంగా లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు గల అవకాశాలను పరిశీలించేందుకు ఈ కమిటిని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో ఇతర సభ్యుల పేర్లతో ఓ నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేయనుందని జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. 
 
కేంద్ర ప్రభుత్వం ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించింది. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ గురువారం ఇచ్చిన ట్వీట్‌‍లో ఈ విషయం వెల్లడించారు. ఈ సమావేశాల్లోనే ఉమ్మడి పౌరస్మృతి బిల్లు, మహిళా రిజర్వేషన్ బిల్లు, ఒకే దేశం - ఒకేసారి ఎన్నికలు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు జరిగితే ఓటర్లు ఎంపీలు, ఎమ్మెల్యేలను ఒకేరోజున ఎన్నుకోవచ్చు. తద్వారా సమయంతో పాటు ఎన్నికల ఖర్చును కూడా గణనీయంగా తగ్గించవచ్చు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
జిందాల్ గ్లోబల్ వర్శిటీ: ఆలుగడ్డలు ఉడికించి కాళ్ళతో తొక్కుతున్న క్యాంటీన్ సిబ్బంది..