1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
  4. Cheating case registered against Prashant Kishore

ప్రశాంత్‌ కిశోర్‌పై చీటింగ్ కేసు నమోదు

Cheating case
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌పై ఓ యువకుడు కేసు పెట్టాడు. బీహార్‌లో తాను “బాత్‌ బీహార్‌ కీ” పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభించి యువతను కలుస్తానని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవలే ప్రకటన చేశారు.

అయితే తన ఐడియాను కాపీ కొట్టి ప్రశాంత్‌ ఈ కార్యక్రమాన్ని రూపొందించారంటూ ఆయనపై ఓ యువకుడు చీటింగ్ కేసు పెట్టారు.

“బాత్‌ బీహార్‌ కీ” కార్యక్రమం తన ఆలోచన అని… ఈ ఐడియాను తన మాజీ సహోద్యోగి ఒసామా ప్రశాంత్‌ కిశోర్‌కు చెప్పాడని మోతీహారీకి చెందిన గౌతమ్‌ అనే యువకుడు ఆరోపించాడు.

ఇప్పటికే తాను బీహార్‌ కీ బాత్‌ అనే కార్యక్రమాన్ని ప్రారంభించానని చెప్పాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలను పోలీసులకు ఇచ్చాడు.

ప్రశాంత్ కిశోర్‌తో పాటు ఒసామాపై 402, 406 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
తర్వాతి కథనం
కేసీఆర్ మానవత్వం.. కాన్వాయ్ ఆపి, వినతి పత్రం తీసుకుని..